టాలీవుడ్ లో ఓటమి ఎరుగని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఆర్.ఆర్.ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం బీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాను డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీరిద్దరితో పాటు మరొక కీలక పాత్రలో అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయింది. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. బాహుబలి సినిమా తరువాత వస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని లైన్ లో పెట్టాడు. కెఎల్ నారాయణ నిర్మాతగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నట్టు స్పష్టం చేసాడు రాజమౌళి. అయితే ఈ సినిమా గురించి పూర్తీ వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఈ ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ తో ఒక తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here