పాన్ ఇండియా సినిమాగా రూపొందిన పుష్ప కోసం ప్యాన్స్ వేయిట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో అంచానాలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు రష్మికా మందన్నా.. విలన్ గా ఫహాద్ ఫాజిల్ వంటి నటులు కూడా ఉండటంతో అంచానాలు పీక్స్ కు వెళ్లాయి.

తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్ని డిసెంబర్ 17 న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్లో బిజీగా ఉన్నారు.
హైదరాబాద్ లోని యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడకకు రాజమౌళి, కొరటాల శివతో పాటు ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనిపై జక్కన్న మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. కష్టపడే తత్వం అల్లు అర్జున్ కు ఎక్కువగా ఉందని.. ఐకాన్ స్టార్ ఇండస్ట్రీకి ఇచ్చిన వరం అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా చాలా అద్భుతంగా వస్తుందని.. సుక్కు, తాను మంచి స్నేహితులం అంటూ చెప్పాడు. బన్నీ నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ కావాలి. అవుతారు కూడా. పుష్పకు ఆల్ ది బెస్ట్ చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. ఎంతో మంది ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవుతుంది అని.. కలెక్షన్ల సునామీ తప్పదు అంటూ చెప్పాడు.































