Rajamouli: అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

0
121

Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇప్పటికే ఎంతో మంది హీరోలతో సినిమాలు చేశారు. ఈయన స్టార్ హీరోలు అయినటువంటి ప్రభాస్, ఎన్టీఆర్ రామ్ చరణ్ వంటి హీరోలతో సినిమాలు చేశారు.అలాగే రవితేజ సునీల్ నాని వంటి హీరోలతో కూడా సినిమాలు చేశారు కానీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా ఉన్నటువంటి చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఈ ముగ్గురు మెగా హీరోలతో ఇప్పటివరకు ఈయన సినిమా చేయలేదు.

ఈ విధంగా రాజమౌళి ఈ ముగ్గురు హీరోలతో సినిమా చేయకపోవడానికి గల కారణం లేకపోలేదు చిరంజీవి వయసు పైబడటంతో ఆయనతో సినిమా చేస్తే సినిమాలో కొన్ని రిస్కీ సన్నివేశాలు చేయడం కష్టం అందుకే ఈయన సినిమాలు చేయలేదు. ఇక పవన్ కళ్యాణ్ తో ఈయన సినిమా చేసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి సినిమా అంటే కనీసం మూడు సంవత్సరాలు పాటు ఆయన ఆధీనంలో ఉండాలి. అంత సమయం పవన్ కళ్యాణ్ కు లేదు కనుక ఈయనతో సినిమా చేసే అవకాశం లేదని చెప్పాలి.

ఇక యంగ్ హీరో అయినటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. కానీ రాజమౌళి అల్లు అర్జున్ తో కూడా సినిమా చేయలేదు. అల్లు అర్జున్ రాజమౌళితో సినిమా చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ రాజమౌళి మాత్రం ఆసక్తి కనపరచలేదని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి కారణం రాజమౌళికి అల్లు అరవింద్ తో ఉన్న విభేదాలు కారణమని తెలుస్తోంది.

Rajamouli: అల్లు అరవింద్ తో ఉన్న విభేదాలు కారణమా..


రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాని అల్లు అరవింద్ నిర్మించారు.అయితే ఈ సినిమా నిర్మాణ సమయంలో రాజమౌళి అల్లు అరవింద్ కు కొన్ని కండిషన్లు పెట్టినప్పటికీ ఆయన మాత్రం తన మాటను ఏమాత్రం లెక్క చేయకుండా సినిమా కలెక్షన్లను బయటకు చెప్పారట. అలాగే ఈ సినిమాను తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలో కూడా విడుదల చేయాలని చెప్పగా అల్లు అరవింద్ ఒప్పుకోలేదట. ఇలా ఈ విషయం గురించి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే రాజమౌళి అల్లు అర్జున్ తో సినిమా చేయలేదని వార్తలు వస్తున్నాయి.