Rajamouli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కల్కి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టడంతో ఈ సినిమాపై ఎంతోమంది సినీ సెలెబ్రెటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాలకు సంబంధించి గత విషయాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ప్రభాస్ ఒకప్పుడు కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే పరిమితమయ్యారు కానీ ప్రభాస్ కి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి కారణం మాత్రం రాజమౌళి అని చెప్పాలి ఈయన దర్శకత్వంలో బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమాని ద్వారా రాజమౌళి ఎవరు చేయని సాహసం చేశారు.
అప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సౌత్ సినిమాలకు పెద్దగా క్రేజీ లేదు అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో లేరు అక్కడ ఈ సినిమా సక్సెస్ అవుతుందా అన్న సందేహంతోనే రాజమౌళి తనపై తాను నమ్మకం ఉంచి ఈ సినిమాని విడుదల చేశారు. ఇక ఈ సినిమా నార్త్ లోకి మంచి ఆదరణ పొందినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.
నెగటివ్ టాక్..
ఇలా తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి నెగటివ్ టాక్ రావడంతో తాను చాలా కంగారపడ్డానని ఆ సమయంలో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయానని తెలిపారు. కానీ రాజమౌళి విజినరీ ముందు నెగిటివ్ టాక్ కొట్టుకుపోయి ప్రతి ఒక్కరు కూడా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే టాక్ కారణంగా సినిమా చూడటానికి వెళ్లి ఈ సినిమాని విజయవంతం చేశారని తెలుస్తోంది.



























