Rajamouli: ఐదేళ్లకు ఒక సినిమా చేస్తే ఎవరైనా హిట్ అందుకుంటారు… రాజమౌళి పై సంచలన వ్యాఖ్యలు చేసిన నిర్మాత!

0
37

Rajamouli: రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు.

ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు అంటేనే ఏంటో తెలియదు అలాంటిది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఒక సినిమా ఆస్కార్ గెలుచుకొనే స్థాయికి తెలుగు సినిమాని జక్కన్న తీసుకువెళ్లారని చెప్పాలి. అయితే ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ రాజమౌళి గురించి మాట్లాడుతూ…ఒక డైరెక్టర్ సినిమాలు చేయాలి అంటే ప్రేక్షకుల నాడి బాగా తెలిసి ఉండాలని తెలిపారు.ఇలా ఎప్పుడైతే ప్రేక్షకుల నాడి తెలిసి ఉంటుందో అప్పుడే సినిమా హిట్ అవుతుందని తెలిపారు. ఇక రాజమౌళి ప్రతి సినిమా హిట్ అందుకుంటున్నారు అంటే అందుకు కారణం ఈయన స్టార్ హీరోలతో సినిమా చేయడమేనని ఈయన తెలిపారు.

Rajamouli: స్టార్ హీరోలతో సినిమా…

ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి…స్టార్ హీరోలతో సినిమా చేస్తే ఎవరైనా హిట్ సినిమాని అందుకుంటారు అంటూ ఈ సందర్భంగా రాజమౌళి గురించి సి కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో మరో అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా పనులలో రాజమౌళి బిజీగా ఉన్నారు.