సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జక్కన్న ఏ సినిమా పట్టుకున్నా బంపర్ హిట్ కావాల్సిందే. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో అతడు దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదట అతడు కె.రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు.

తరువాత, అతను కె. రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం అనే టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రి కూడా ఎన్టీఆర్ హీరోనే హీరోగా తీసుకన్నారు. తర్వా కొన్నాళ్లకు ఎన్టీఆర్ తోనే యమదొంగ సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టాడు. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.
ఈ సినిమా ప్రస్తతుం విడుదలకు సిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ తో పాటు సహ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిదే. మల్టీస్టారర్ గా ఈ సినిమా తెరకెక్కుతోది. దీనిని జనవరి 7, 2022లో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం గురించి మరో అప్ డేట్ వచ్చింది.
ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్ షో వేశారని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ షోను ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యామిలీలకు చూపించారనేది తెలుస్తోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని.. వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఇక మెగస్టార్ చిరంజీవి అయితే రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తినట్లు సమాచారం.

































