1920లలో చోటు చేసుకున్న సంఘటనల ఆధారంగా.. RRR సినిమా స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు జీవితాల నుండి ప్రేరణ పొందింది. రామ్ చరణ్ సీతారామ పాత్రలో కనిపించనుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్ , నిర్మాతలు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. తెలుగు టాప్ హీరోలు రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్‌లతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మీడియాతో ఇంటరాక్ట్ చేసిన దర్శకుడు, వారు తమ పాఠశాలలో మొదటి రోజు “పిల్లల”లా నటించారని అన్నారు.
రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ అర్ధంలేని గొడవల కారణంగా 20 రోజులకు పైగా షూటింగ్ రోజులు వృధా అయ్యాయని రాజమౌళి పేర్కొన్నాడు. ” ఇక ఈ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు రాజమౌళి కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించింది.
ట్రైలర్ లోనే దాదాపు స్టోరీని అంతా రివీల్ చేసిన రాజమౌళి.. ఎన్టీఆర్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడు.. నాటు నాటు సాంగ్ కు కొమురం భీమ్ డ్యాన్స్ వేయడం ఏంటి వంటి ప్రశ్నలు మీడియా ప్రతినిధులు అడగడంతో కోపం తెచ్చుకున్నారు రాజమౌళి. ట్రైలర్ లోనే అంతా రివీల్ చేసిన తర్వాత కూడా.. ఇలాంటి ప్రశ్నలు ఏంటి అని.. స్క్రిప్ట్ మొత్తం మీ ముందు ఉంచమంటారా.. కథ మొత్తం చెప్పమంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.































