Vijayendra Prasad: భారత రాజ్యాంగం ప్రకారం గత కొన్ని సంవత్సరాలుగా ఎవరైతే వివిధ రంగాలలో సేవలు అందిస్తూ దేశ ప్రతిష్ఠను కాపాడుతారో అలాంటి వారికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కోటాలో వారిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్రపతి కోటాలో భాగంగా నలుగురిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు ప్రధానమంత్రి వెల్లడించారు.

ఈ విధంగా రాజ్యసభకు ఎంపిక చేసిన వారిలో నలుగురు కూడా సౌత్ కు చెందిన సెలబ్రిటీలు కావడం గమనార్హం. వీరిలో ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ ను రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేశారు. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, క్రీడా రంగానికి చెందిన పి.టి.ఉష, ప్రముఖ ఫిలాంత్రాఫిస్ట్ అయిన ఇంద్ర వీర హెగ్డే ని కూడా రాజ్యసభకు నామినేట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించారు.

ఇకపోతే సినిమా రంగంలో కొన్ని దశాబ్దాల నుంచి విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ రైటర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన రచించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆయన రచించిన బజరంగీ భాయిజాన్ సినిమాకి కూడా దేశవ్యాప్తంగా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇకపోతే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా విజయాల గురించి మనకు తెలిసిందే.
ఫోన్ చేసి అభినందించిన ప్రధానమంత్రి…
ఇళయరాజా సంగీతంలో వచ్చిన పాటలు ఇప్పటికీ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈయన కూడా గత కొన్ని దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఎన్నో సేవలు చేయడంతో ఇతనిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ విధంగా రాజ్యసభకు నామినేట్ అయిన వారికి స్వయంగా నరేంద్ర మోడీ ఫోన్ చేసి వారికి అభినందనలు తెలియజేశారు. ఇక సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరికీ రాజ్యసభ సభ్యులుగా అవకాశం రావడంతో సినీ ప్రముఖులు వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.































