రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో 2000 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మా అన్నయ్య. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, వినీత్, దీప్తి భట్నాగర్ మరియు నాసర్ సహాయక పాత్రల్లో డా. రాజశేఖర్, మీనా హీరో హీరోయిన్లుగా నటించారు. దీనికి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. ఈ సినిమాలోని పాటలు అన్నీ విపరీతంగా హిట్ అయ్యాయి.

ఈ చిత్రం తమిళ చిత్రం వనతైపోలా (2000)కి రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక రీమేక్ సినిమాల విషయానికి వస్తే.. ఎక్కువగా టాలీవుడ్ లో విక్టరీ వెంటకేష్, పవన్ కళ్యాణ్ లు ముందు వరుసలో ఉంటారు. కానీ ఈసారి అయితే వనతైపోలా తమిళ చిత్రానికి అప్పట్లో ఫుల్ రైట్స్ తీసుకున్నారు రాజశేఖర్. అయితే మొదట ఈ సినిమాకు వేరే దర్శకుడు అనుకున్నారట. కానీ సెట్స్ పైకి వెళ్లే సరికి దర్శకుడు మారాడని తెలిసింది.
ఈ సమయంలో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుకుంటూ వచ్చిందట. ఈ గ్యాప్ లో రాజశేఖర్ మనసున్న మారాజు సినిమాను కంప్లీట్ చేశారు. దీనికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా రిమేక్ కావడంతో .. ఇక మా అన్నయ్య సినిమాను తెర కెక్కించేందుకు రవిరాజా పనిశెట్టి దగ్గరకు వచ్చాడట.
అలా సినిమా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 1, 2000లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే సినిమాను కన్నడంలో కూడా రిమేక్ చేస్తే.. అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ అయింది. నేటికి ఈసినిమా విడుదలై 21 ఏళ్లు పూర్తయింది. ఇలా ఈ సినిమా మూడు భాషల్లో సూపర్ హిట్ కొట్టేసింది.
































