Rajeev Kanakala: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు రాజీవ్ కనకాల. యాంకర్ సుమ భర్తగా కూడా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే.ప్రస్తుతం వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఉన్నటువంటి రాజీవ్ కనకాల తాజగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఎన్నో విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో తనకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి ఈ సందర్భంగా తెలిపారు. గతంలో ఎన్టీఆర్ రాజీవ్ ఇద్దరు కూడా తరచూ కలుస్తూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు అయితే ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని అందుకే దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రాజీవ్ స్పందించారు.
ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నాకు ఎన్టీఆర్ కి మధ్య ఏ విధమైనటువంటి గొడవలు లేవు అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ స్టార్ హీరో కావడంతో ఆయన వరుస కమిట్మెంట్లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక నాకు కూడా ఎన్నో బాధ్యతలు పెరిగాయి దాంతో ఇద్దరు తరచూ కలవడం కుదరలేదు కానీ మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతూ ఉందని తెలిపారు.

Rajeev Kanakala: మాకు ఎలాంటి గొడవలు లేవు…
తాజాగా ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా తనని ఇంట్రడ్యూస్ చేసే పాత్రలో నేనే నటించాను. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని ఇద్దరం కూడా మంచిగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్ జరుగుతుంది సినిమా షూటింగ్ చూడటం కోసం తారక్ నన్ను రమ్మని పిలిచారు. కానీ నాకే కుదరడం లేదు త్వరలోనే దేవర షూటింగ్ లోకేషన్ కి వెళ్తాను అంటూ ఈ సందర్భంగా రాజీవ్ కామెంట్ చేస్తూ తనకు ఎన్టీఆర్ కి మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.