Rajendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని నటి కిరీటి బిరుదుతో ఎంతో గౌరవాన్ని అందుకున్నటువంటి నటుడు రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా సంతోష్ శోభన్ మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అన్ని మంచి శకునములే సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు.

ఈ సినిమా షూటింగ్ పనులన్నింటిని పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేశారు. ఈ టైటిల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు.ఇక ఈ సినిమా వేడుకలో భాగంగా నటుడు రాజేంద్రప్రసాద్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ నటుడు నరేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నటుడు నరేష్ రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా రెండు కత్తులు లాంటి వారు అంటూ మీడియా ప్రతినిధి చెప్పగా వెంటనే స్పందించిన రాజేంద్రప్రసాద్ తాను నరేష్ లాంటి కత్తిని కాదనీ అసలు సిసలైన కత్తి నరేష్ అని నేను కేవలం ఒర మాత్రమేనని తెలిపారు.ఇక నరేష్ ను దగ్గరికి తీసుకుని చూడండి పెళ్లి కొడుకుల తయారయ్యారుగా అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పడంతో నేను పెళ్ళికొడుకుల తయారవ్వడం ఏంటి? నేను ఎప్పుడు పెళ్లి కొడుకుని అంటూ నరేష్ తెలిపారు.

Rajendra Prasad:తమ్ముడు లాంటివాడు…
ఇక ఈ మాటలకు రాజేంద్రప్రసాద్ అవును రా నేను చెప్పడం మర్చిపోయాను నువ్వు నిత్య పెళ్లి కొడుకు అంటూ నరేష్ పై సెటైర్లు వేశారు.అయితే నరేష్ ఈ వ్యాఖ్యలను సరదాగా తీసుకున్నారు ఇక నరేష్ గురించి మాట్లాడుతూ తనకు నరేష్ తమ్ముడు లాంటివారు అంటూ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు ఇలా నరేష్ గురించి రాజేంద్రప్రసాద్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.