డబ్బు విషయంలో నమ్మినవారే, నా అనుకున్న వాళ్ళే తనని మోసం చేశారని నటకిరీటి రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న రాజేంద్ర ప్రసాద్ హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలు పోషించి మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తొలుత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మంచి కామెడీ ని అందించిన రాజేంద్రప్రసాద్ ఆ తర్వాత హీరోగా చాలా సినిమాల్లో నటించి కామెడీ హీరోగా ఎదిగారు.. ట్రెండ్ కు తగ్గట్లు నటిస్తూ ప్రొడ్యూసర్స్ హీరో అయిపోయారు..

మధ్య తరగతి కుటుంబంలో నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం తండ్రి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. ఇప్పటికే పలు పెద్ద పెద్ద సినిమాల్లో తండ్రి పాత్రలు పోషిస్తూ ఆకట్టుకుంటున్న అయన తాజగా అయన ప్రధాన పాత్రలో నటించిన గాలి సంపత్ సినిమా త్వరలోనే రిలీజ్ కి రెడీ గా ఉంది.. ఈ సినిమాలో అయన పాత్ర ఎంతో వెరైటీ గా ఉంటుందని తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్న అయన క్లైమాక్స్ అనే చిత్రం గురించి ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు శివాజీ రాజా తో ఎలాంటి వివాదాలు లేవన్నారు..
రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్’. భవానీ శంకర్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో అయన మాట్లాడుతూ తాను దిగువ తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, ఇండస్ట్రీ కిరావడానికి ముందు మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. అక్కడ గోల్డ్ మెడల్ సాధించాను. అన్నారు. అలాగే “జీవితంలో బాధాకరమైన సంఘటనలంటూ ఏమీ లేవు. కానీ చాలామంది దగ్గర నేను మోసపోయాను. అదీ ముఖ్యంగా డబ్బు విషయంలో రక్త సంబంధీకుల వద్దే నేను మోసపోయాను. కొన్ని సంఘటనల తర్వాత అసలు నేను ఇన్నాళ్లు సంపాదించిన సొమ్ము ఏమైంది అని చూసుకుంటే.. అప్పుడు అర్థమైంది వాళ్లు నన్ను మోసం చేసి వెళ్లిపోయారని” అని రాజేంద్రప్రసాద్ వివరించారు.



































