Mahasena Rajesh: మహాసేన రాజేష్ పరిచయం అవసరం లేని పేరు. గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన ఈయన ఎన్నికల తర్వాత పెద్దగా ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా మహాసేన రాజేష్ ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తల పై ఈయన స్పందించారు.

ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మాట్లాడుతూ ముందు నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటే అంతకన్నా ముందు జనసేన పార్టీని సస్పెండ్ చేయాలని ఈయన తెలిపారు. పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడింది మొదట జనసేన నేతలేనన్నారు. తనపై జనసేన నేతలు విమర్శలు చేశారని తెలిపారు.
నాపై ఈ విధంగా జనసేన నేతలందరూ విమర్శలు చేస్తున్నప్పుడు ఆ పార్టీ అధినాయకత్వం కనీసం స్పందించలేదని ఈయన వెల్లడించారు.కూటమి ధర్మాన్ని ముందు జనసేన నేతలే తప్పారని.. కాబట్టి, కూటమి నుండి జనసేనను బయటకు పంపి.. ఆ తర్వాత తనను సస్పెండ్ చేస్తే ఓకేనన్నారు.
టీడీపీ గెలవడం అదృష్టం..
మైనార్టీలకు వ్యతిరేకంగా పవన్ వ్యాఖ్యలు సరికాదని..టీడీపీకి ఇంత మెజార్టీ రావడం రాష్ట్ర అదృష్టమని అన్నారు. ఇలా పార్టీ నుంచి తనని సస్పెండ్ చేసే అంశం గురించి మహాసేన రాజేష్ మాట్లాడుతూ చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా వెనక్కి తగ్గిన తర్వాత జనసేనపై కీలక వ్యాఖ్యలు చేశారు.





























