జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో అరవింద సమేతకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందులో పొలిటికల్ డ్రామా నుంచి ఫ్యామిలీ, లవ్ వంటి యాంగిల్ లో కొనసాగుతోంది. దీంతో ఆ సినిమా పెద్ద హిట్ అందుకుంది. దీనిలో విలన్ గా నటించిన జగపతి బాబు నటన వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు.

అంతే కాదు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరు తమ పాత్రకు న్యాయం చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దీనిలో నటించిన నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తారక్ కు ఫోన్ చేసి అభినందించారు.
ఇలా ప్రశంసించిన వారిలో రజనీకాంత్ కూడా ఒకరు ఉన్నారు. సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణతో స్నేహబంధం కూడా ఉన్నదని పలుమార్లు తెలియజేశాడు. హరికృష్ణ మరణించినప్పుడు తాను జపాన్ లో ఉన్నానని.. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ బాధను చూడలేకపోయానని రజనీ కాంత్ చెప్పినట్లు సమాచారం.
అయితే ఇటీవల రజనీకాంత్ అరవింద సమేత సినిమా చూసి జూనియర్ ఎన్టీఆర్ పై కొన్ని కామెంట్ చేశారు. మొదటిసారి తను ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇటువంటి కొడుకులు లేనందుకు బాధపడుతున్నానని.. ఎన్టీఆర్ లాంటి కొడుకు తనకు ఉంటే బాగుండేదని అతడు తన మనస్సులోని మాటలను చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఇటీవల రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కె అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.
































