సినిమాల్లో చూసే కథలు నిజ జీవితంలోనూ జరుగుతున్నాయనడానికి ఇది మరో ఉదాహరణ. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా తరహాలోనే సాగిన ఓ సంచలన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపుతోంది. తన మాజీ ప్రియుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడన్న కక్షతో, అతని భార్యను అడ్డుతొలగించుకోవాలనే దురుద్దేశంతో ఓ యువతి ప్రాణాంతక వైరస్‌ను ఇంజెక్షన్ రూపంలో ఎక్కించేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగులోకి వచ్చింది. సినిమాల్లో విలన్లు చేసే కుట్రలు చూసుంటారు.. కానీ కర్నూలులో ఒక మహిళ చేసిన పని వింటే, “మనుషులు ఇంత క్రూరంగా కూడా ఆలోచిస్తారా?” అనిపిస్తుంది. ప్రియుడు తనని దూరం పెట్టాడన్న కోపంతో, ఏకంగా అతని భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చి చంపాలనుకుంది ఒక కిరాతకురాలు. ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వివరాల్లోకి వెళ్తే…

అసలు ఏం జరిగింది?
కర్నూలు గణేష్ నగర్ ఏరియాలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయనకు నందికొట్కూరు రోడ్డులో ఉండే వసుంధర అనే మహిళతో గతంలో పరిచయం ఉంది. అయితే, ఆ డాక్టర్ గారికి పెళ్లయ్యాక వసుంధరను పూర్తిగా పక్కన పెట్టేశాడు. “నాకు దక్కనివాడు ఇంకెవరికీ దక్కకూడదు.. భార్యాభర్తలను విడదీస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తాడు” అని ఆ వసుంధర ఒక భయంకరమైన ప్లాన్ వేసింది.
సినిమా రేంజ్ లో స్కెచ్!
వసుంధర ఒక్కతే కాదు.. ఆమెకు తోడు మరో ముగ్గురు (జ్యోతి, జస్వంత్, శృతి) కలిశారు. ప్లాన్ ప్రకారం… జనవరి 9న డాక్టర్ గారి భార్య స్కూటీపై వెళ్తుండగా లక్ష్మీనగర్ దగ్గర కావాలని వెహికల్‌తో ఢీకొట్టారు. ఆమె కింద పడిపోగానే, సాయం చేస్తున్నట్టు నటించి ఆటోలో ఎక్కించారు.
ఆటోలోనే అసలు దారుణం!
పాపం.. సాయం చేస్తున్నారనుకున్న ఆ బాధితురాలికి అప్పుడే అసలు భయం తెలిసింది. ఆటోలో సిద్ధంగా ఉన్న వసుంధర, బాధితురాలిపై HIV వైరస్ ఉన్న ఇంజెక్షన్‌తో దాడి చేసింది. బాధితురాలు గట్టిగా అరవడంతో నిందితులంతా అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే ఆమె తన భర్తకు చెప్పడం.. ఆయన పోలీసులను ఆశ్రయించడంతో ఈ కుట్ర బయటపడింది.
పోలీసుల ఎంట్రీ.. సీన్ రివర్స్!
డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ శేషయ్య టీమ్ రంగంలోకి దిగారు. సీసీ టీవీ ఫుటేజీలు చెక్ చేయగా అసలు నిజం బయటపడింది. వసుంధరతో పాటు ఆమెకు సహకరించిన మిగిలిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. అదృష్టవశాత్తూ బాధితురాలు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.
చూశారుగా.. వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారి తీస్తున్నాయో! ఒక్క తప్పుడు ఆలోచన నలుగురి జీవితాలను రోడ్డున పడేసింది. ఈ ఘటన ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఏపీలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన
— Telugu Scribe (@TeluguScribe) January 24, 2026
ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ ఇచ్చిన మాజీ ప్రియురాలు
కర్నూలులో స్కూటీపై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ప్రియుడు కరుణ్ కుమార్ భార్య శ్రావణికి సహాయం పేరుతో, వైరస్ ఇంజెక్షన్ చేసిన మాజీ ప్రియురాలు వసుంధర
వసుంధరతో పాటు ఆమెకు సహాయం చేసిన… pic.twitter.com/Sppw9TivHh































