Rakesh Master : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు.

ఆయన తుది జీవితం వివాదాల మయం…
రాకేష్ మాస్టర్ కోరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు, ఎంతోమంది వర్ధమాన డాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ వంటి వారికి గురువు. ఇక ప్రభాస్ లాంటి హీరోలకు డాన్స్ శిక్షణ ఇచ్చాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో అనేక వివాదాలకు కేర్ అఫ్ అయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ వాళ్లను విమర్శిస్తూ ఫేమస్ అయ్యారు. అలాగే తన పెళ్లిళ్లతోను ఫేమస్ అయ్యారు. మొదటి భార్య మరణించాక రెండో పెళ్లి చేసుకున్న ఆయన ఆమె విడిగా ఉండటం వల్ల ఒంటరి అయ్యారు. రాకేష్ మాస్టర్ ఎవరి గురించైనా సూటిగా మాట్లాడటం వల్ల శత్రువులు ఎక్కువయ్యారు.

అలా వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రెండో భార్య విడిగా ఉంటున్నారు. ఇక మూడో సారి పెళ్లి చేసుకోకుండా లక్ష్మి అనే మహిళతో సహజీవనం చెసారు రాకేష్ మాస్టర్. ఆమె వంట చేయడానికని వచ్చి మాస్టర్ కి దగ్గరైంది. ఆమెకు భర్త లేడు, చావైనా బతుకైనా రాకేష్ మాస్టర్ తోనే అంటూ ఆమె పలు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఇక లక్ష్మి కూతురు రాజమండ్రి లో ఒక పెద్ధ కోటీశ్వరుడుని పెళ్లి చేసుకుని ఒక స్కూల్ పెట్టుకుని ఉన్నారు. హైదరాబాద్ లో ఒంటరిగా ఉంటున్న ఆమె రాకేష్ మాస్టర్ కి దగ్గరైంది. అయితే ఆమె మోసం చేసిందని ఆయన కొద్దిరోజులకు అనాధ ఆశ్రమంలో చేరి బాధపడ్డారు. తన పిల్లలను తిట్టేదని డబ్బు కోసం నా దగ్గర చేరిందని బాధపడ్డారు. తాజాగా అనారోగ్యంతో ఆయన రక్త విరేచనాలు కావడంతో మల్టీపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల్ల గాంధీ ఆసుపత్రిలో ఆదివారం తుది శ్వాస విడిచారు.
































