Rakul Preeth Singh: రకుల్ ప్రీతి సింగ్ ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే .దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా ఉత్తరాది సినీ ఇండస్ట్రీలో కూడా ఎన్నో అవకాశాలు అందుకొని కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు జాకీ భగ్నాని అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ఫిబ్రవరి 21వ తేదీ ఈ జంట గోవాలో ఎంతో ఘనంగా తమ పెళ్ళిని జరుపుకున్నారు.

ఇలా పెళ్లి తర్వాత కూడా రకుల్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అంతేకాకుండా తన భర్తతో కలిసి పలు అకేషన్ లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు అయితే పెళ్లి అయిన తర్వాత కూడా ఈమెలో పెద్దగా మార్పు ఏమి రాలేదని తెలుస్తుంది. పెళ్లికి ముందు ఏ విధంగా అయితే పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేసేదో పెళ్లి తర్వాత కూడా అలానే గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.
అత్తారింట్లో స్వేచ్ఛ ఉంది..
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు ఇదే ప్రశ్న ఎదురయింది. మీ ఇంట్లో మీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని సలహా ఇవ్వలేదా అంటూ ప్రశ్నించగా నాకెవరు అలాంటి సలహా ఇవ్వలేదు అయితే నేను పుట్టింట్లో ఎలా ఫ్రీగా ఉన్నాను అత్తారింట్లో కూడా నాకు అలాంటి ఫ్రీడం ఉందని తెలిపారు. ఇక పెళ్లి తర్వాత పద్ధతులు మార్చుకోవాలని అమ్మాయిలకి ఎందుకు చెబుతారు ఇదే విషయం మగాళ్లకు ఎందుకు చెప్పరు అంటూ ప్రశ్నిస్తూ ఈమె చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి.































