Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. RRR సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్న చరణ్ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఈయన ఉపాసనని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఉపాసనా అపోలో గ్రూప్స్ సంస్థలలో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బై బర్త్ గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఈ ఇద్దరు వారి రంగాలలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారు.
ఇక వీరి వివాహం 2012వ సంవత్సరంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక పెళ్లి తర్వాత పదేళ్లపాటు పిల్లలను వద్దని నిర్ణయం తీసుకున్న వీరిద్దరూ వారి నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్రమంలోనే ఉపాసనకు పిల్లలు కలగకపోవడంతో వీరి పట్ల విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఈ విమర్శలకు చెక్ పెడుతూ ఉపాసన గత ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
కారా మమ్మీ…
ఆ చిన్నారికి లలితా సహస్ర నామాలలో ఒకటైన క్లిన్ కారా అని నామకరణం చేశారు. అయితే తాజాగా తనకు కుమార్తె పుట్టిన తర్వాత చరణ్ తన భార్య ఉపాసన పేరును పూర్తిగా మార్చేసారని తెలుస్తుంది. ఇటీవల ఉపాసన తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే ఉపాసనకు రాంచరణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ..హ్యాపీ బర్త్ డే కారా మమ్మీ అని శుభాకాంక్షలు తెలపడంతో కూతురు పుట్టాక చరణ్ తన భార్య పేరును కూడా మార్చేసారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.



























