Ram Charan: మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తమకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి రామ్ చరణ్ చిరుత సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

ఇలా మొదటి సినిమాతోనే ఈయన ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అనంతరం వెనక్కి తిరిగి చూడకుండా సినిమాలలో నటిస్తూ నేడు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఈయన నటన డాన్సులకు ఎంతోమంది అభిమానులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు డాన్సులకు ప్రేక్షకులు ఫిదా కావడమే కాకుండా మొదటి సినిమాకే విజయాన్ని అందించారు.
అయితే రామ్ చరణ్ మొట్టమొదటిసారి ఈ సినిమా కోసమే డాన్స్ చేశారని తాజాగా ఈయన డాన్స్ గురించి ఎవరికీ తెలియని రహస్యాన్ని బయటపెట్టారు. చిన్నప్పటినుంచి రాంచరణ్ ఏ ఫంక్షన్ లోనూ డాన్స్ లు చేసేవారు కాదట తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన అల్లు అర్జున్ డాన్స్ వేసేవారని, ఇక సినిమాలలోకి వచ్చేముందు అందరూ నటన డాన్స్ లో శిక్షణ తీసుకుంటారు కానీ తాను ఎక్కడ శిక్షణ తీసుకోలేదు.

Ram Charan: డాన్స్ లో ఎలాంటి శిక్షణ లేదు..
మొదటిసారిగా చిరుత సినిమాలోనే తాను డాన్స్ చేశారని తెలుస్తోంది. అయితే మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ చిరుత సినిమా కోసం డాన్స్ చేసినప్పటికీ ఈ సినిమాలో తన స్టెప్పులతో ప్రేక్షకులను ఫిదా చేశారు. ఈ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్ తాను ఈ సినిమా కోసం ఇలా డాన్స్ చేస్తానని ఎప్పుడూ ఊహించుకోలేదనీ చరణ్ తెలిపారు.ఈ విధంగా చిరుత సినిమాతో హిట్ కొట్టిన రాంచరణ్ అనంతరం మగధీర వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు. ఇక ఈయన కూడా తన కెరీర్లు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

































