Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా వారసుడుగా పరిచయమయ్యారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రామ్ చరణ్ అనంతరం మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోగా మారిపోయిన రామ్ చరణ్ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో హీరోగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా ఈయన హీరోగా ఎంతో గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ భారీగానే ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తుంది. ఒక సర్వే ప్రకారం ఈయనకు దాదాపు 1370 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఇలా ఆస్తులు మాత్రమే కాకుండా జూబ్లీహిల్స్ లో ఖరీదైన ఇల్లు అలాగే ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. వీటి విలువ సుమారు 50 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.ఇలా ఖరీదైన కార్లు మాత్రమే కాకుండా చరణ్ ప్రత్యేకంగా ఒక ప్రైవేటు జట్ కూడా కొనుగోలు చేశారు. దీని విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తుంది.

Ram Charan: నెలకు మూడు కోట్ల ఆదాయం…
ఇలా ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండా నిర్మాతగా కూడా మారి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. ఇలా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ దాదాపు 30 బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీగా సంపాదిస్తున్నారు.ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే చరణ్ నెలకు మూడు కోట్ల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తోంది.


























