Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఇటీవల చెన్నై వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీకి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. ఏప్రిల్ 13వ తేదీ సాయంత్రం జరిగినటువంటి యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమాలలో భాగంగా రామ్ చరణ్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో రామ్ చరణ్ కాస్త ఇకపై డాక్టర్ రామ్ చరణ్ గా మారిపోయారని చెప్పాలి. ఇక ఈయనకు డాక్టర్ అందించడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా డాక్టరేట్ అందుకున్నటువంటి రామ్ చరణ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చెన్నైలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి వేల్స్ యూనివర్సిటీ నుంచి నాకు ఈ గౌరవం దక్కడం నిజంగా సంతోషంగా అనిపిస్తుందని ఈయన వెల్లడించారు. ఆర్మీ లాంటి గ్రాడ్యుయేషన్ మధ్యలో నేను ఇలా ఈరోజు ఉండటం ఊహిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
అందరి గౌరవం ఇదీ…
ఈరోజు ఇలా డాక్టరేట్ అందుకున్నాను అంటే అది కేవలం నాకు దగ్గర గౌరవం మాత్రమే కాదని తెలిపారు నన్ను ఆదరించిన అభిమానులది నన్ను నమ్మి సినిమా అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలది అంటూ రాంచరణ్ కామెంట్స్ చేశారు. ఇక ఈ యూనివర్సిటీని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులకు అధ్యాపకులకు అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.



























