Ram Charan: సాధారణంగా సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇలా వారు బయటకు ఎక్కడికి వెళ్లినా వారిని సంరక్షిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఇండియాలో వారి చుట్టూ కనిపించే సెక్యూరిటీ అక్కడ కనిపించదు.

ఇలా కొన్ని దేశాలకు సెలబ్రిటీలు కనుక వెళ్తే అక్కడ ప్రభుత్వం వారికి స్పెషల్ సెక్యూరిటీని కల్పిస్తుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు.ఈ విధంగా అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రామ్ చరణ్ కు ఇండియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ కాకుండా అక్కడ ప్రభుత్వం ప్రత్యేకమైన సెక్యూరిటీ ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే రాంచరణ్ హైదరాబాద్ లో గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు రాంచరణ్ కారు దిగి బయటకు వచ్చారు. అయితే రామ్ చరణ్ కారు డోర్ తీసి ఆయనకు సెక్యూరిటీ కల్పించిన వ్యక్తి మాత్రం ప్రస్తుతం హైలైట్ అయ్యారు.

Ram Charan:ఇంతెత్తు ఉన్నాడేంటి….
రామ్ చరణ్ కోసం ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి చూడటానికి చాలా హైట్ వెయిట్ ఉండడంతో ఈయన పర్సనాలిటీ చూసినటువంటి నెటిజెన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఈయన ఏంటి ఇంత హైట్ ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ సెక్యూరిటీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Entire video of our OG #GlobalStarRamCharan @AlwaysRamCharan ????????#ManOfMasessRamCharan #Ramcharan #GoodMorningAmerica pic.twitter.com/25WWZIcERb
— SivaCherry (@sivacherry9) February 22, 2023



































