Ram Charan: వామ్మో రామ్ చరణ్ ధరించిన ఈ వస్తువుల ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

0
123

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టి ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం విదేశాలను పర్యటిస్తూ షూటింగ్ పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇకపోతే రామ్ చరణ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలలో రామ్ చరణ్ ధరించిన వాచ్, షూస్ మరియు శాండిల్స్ ధర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే వీటి ద్వారా తెలిసినటువంటి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్య పోతున్నారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ధరించిన రిచర్డ్ మిళ్లే వాచ్ రిచర్డ్ ధర రూ.3,03,38,852 లని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇక ఈయన ధరించిన నైక్ షూస్ రూ.3,60,971 రూపాయలు. అదేవిధంగా గూచి శాండల్స్ ధర రూ.53,300 అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Ram Charan:

సాధారణంగా సెలబ్రిటీలు వారి సంపాదనకు అనుగుణంగా ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా బ్రాండెడ్ అయి ఉండాలని భారీ మొత్తంలో ఖరీదు చేసే వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.ఇక వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రాంచరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నారని వార్త తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.