Ram Charan: కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ విధంగా ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ సొంతం చేసుకోవడంతో చిత్ర నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి మెగాస్టార్ చిరంజీవి పలుమార్లు స్పందిస్తూ తాము డైరెక్టర్ చెప్పిన విధంగానే చేశామని ఈ సినిమా ఫ్లాప్ మొత్తం డైరెక్టర్ పై తోసివేశారు. అయితే ఇప్పటివరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా ఫ్లాప్ గురించి ఏమాత్రం స్పందించలేదు.మొదటిసారిగా రామ్ చరణ్ ఆచార్య సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా చరణ్ హెచ్ టి లీడర్ షిప్ సమ్మిత్ కు హాజరయ్యాడు.ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సైతం హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఆచార్య సినిమా గురించి మొదటిసారి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ వంటి గొప్ప సినిమా తర్వాత ఆచార్య సినిమాలో నటించినప్పటికీ ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్ కి రాలేదని వెల్లడించారు.

Ram Charan సినిమాలో కంటెంట్ కీలకం…
ప్రేక్షకులు థియేటర్ కి రావాలంటే తప్పనిసరిగా సినిమాలో స్టార్ క్యాస్టింగ్ కాదని, సినిమాలో కంటెంట్ ఉండాలంటూ ఈయన వెల్లడించారు.ప్రస్తుతం ప్రేక్షకుల అభిప్రాయాలు మారిపోయాయి కంటెంట్ ఉంటేనే సినిమాలను ఆదరిస్తున్నారని ఇలా ఆచార్య సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్లే సినిమా సక్సెస్ కాలేకపోయింది అంటూ ఈ సందర్భంగా రామ్ చరణ్ ఆచార్య సినిమా గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































