Ram Charan: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి గొప్ప సినిమా తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో చెర్రీ కి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రామచరణ్ కాంబినేషన్లో మరొక పని లేదా మూవీ రాబోతోందట.

ఇప్పటికే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో రంగస్థలం సినిమా విడుదల అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన సినిమా ఇదే. అప్పట్లోనే ఇది రెండు వందల కోట్లు దాటింది. అదిరిపోయే కాంబినేషన్‌గా రామ్ చరణ్, సుకుమార్ కాంబో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ కాంబో రిపీట్ కాబోతుంది. మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్‌తో పుష్ప2 చిత్రం చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. పుష్ప మూవీ ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ఇక ఈ మూవీ విడుదల తర్వాత సుకుమార్ ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ రామ్‌చరణ్ తో చేయబోతున్నారట.
అప్పటి నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్..
ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా లాక్ అయినట్టు తెలుస్తోంది. డేట్స్, బడ్జెట్ కూడా ఫైనల్ అయ్యిందని అంటున్నారు. ఈ కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితమే ఓకే అయ్యిందని పుష్ప2 పూర్తయిన తర్వాత దీనిపై వర్క్ చేయబోతున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేయబోతున్నారట. ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారని తెలుస్తుంది. బడ్జెట్‌ని ఏకంగా నాలుగు వందల కోట్లు ఎస్టిమేట్ చేసినట్టు టాక్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.


























