Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన నటుడిగా వరుస సినిమాలలో నటించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలు అవార్డులను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ మరొక అరుదైన అవార్డును సొంతం చేసుకున్నారు.

రామ్ చరణ్ ఇండస్ట్రీకి అందించిన సేవలను గుర్తించినటువంటి చెన్నైకి చెందిన వేల్స్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈనెల 13వ తేదీ యూనివర్సిటీలో జరగబోయే స్నాతకోత్సవాలలో భాగంగా రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ డాక్టరేట్ అందుకోబోతున్నారు.
ఈ విధంగా రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదే యూనివర్సిటీ నుంచి గత కొద్ది నెలల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కూడా డాక్టరేట్ ప్రధానం చేయగా ఆయన ఆ డాక్టరేట్ చాలా సున్నితంగా తిరస్కరించారు.
వేల్స్ యూనివర్సిటీ..
నాకంటే కూడా ఎంతో గొప్పవారు ఉన్నారని తనకు ఇవ్వాల్సిన డాక్టరేట్ వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈయన తనకు వచ్చినటువంటి డాక్టరేట్ రిజెక్ట్ చేశారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి కూడా అదే గౌరవం లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ బిజీగా ఉండగా ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు, సుకుమార్ డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు.



























