Klin Kaara: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముద్దుల కుమార్తె క్లీన్ కారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉపాసన రాంచరణ్ దంపతులకు పెళ్లైన 11 సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించడంతో ఈ చిన్నారి చాలా స్పెషల్ గా మారిపోయారు. ఇక ఉపాసన ఒక తల్లిగా తన కూతురి పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నారు అయితే ఇప్పటివరకు తన కుమార్తె ఫేస్ ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా ఈమె రివీల్ చేయలేదు.

ఈమె తన బర్త రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లగా అక్కడి తన కుమార్తె ఫేస్ బయటపడటంతో మెగా ప్రిన్సెస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవల రామ్ చరణ్ తన భార్య కుమార్తెతో కలిసి థాయిలాండ్ సమ్మర్ వెకేషన్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ దిగినటువంటి ఫోటోలను తరచు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వచ్చారు..
తాజాగా ఉపాసన బ్యాంకాక్ వెకేషన్ ఫొటోలు రైమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ నాన్న, బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేసాను, స్విమ్ చేసాను, చెల్లి క్లిన్ కారాతో ఆడుకున్నాను, నేను కొత్త థాయ్ కట్ చేయించుకున్నాను అంటూ క్యూట్ గా పోస్ట్ చేశారు. ఈ ఫోటోలలో రైమ్ నీటిలో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
బ్యాంకాక్ వెకేషన్..
ఈ ఫొటోల్లో కుక్క పిల్ల రైమ్ సరదాగా నీళ్ళల్లో ఆడుకుంటుంది. ఓ ఫొటోలో చిన్ని ఏనుగుకి చరణ్ వాటర్ పోస్తుంటే ఉపాసన క్లిన్ కారాని ఎత్తుకొని ఆ ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తుంది. మరో ఫొటోలో రైమ్ ని అక్కడి బ్యాంకాక్ వాళ్ళు ఎత్తుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి



























