ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాపై ప్రతీ ఒక్కరూ ఆశలు పెట్టుకున్నారు.

ఎప్పుడు విడదల అవుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఒక పాట విడుదల చేశారు. దానికి యూట్యూబ్ లో లక్షల వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే రాజమౌళి ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదటి రోజు సందడి చేసిన విషయం తెలిసిందే.
అంతే కాదు అతడు అభిమానులకు సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ దగ్గర అవుతూనే ఉన్నాడు. అంతే కాకుండా కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అతడు తనకు సంబంధించి కొన్ని విషయాలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోస్టు చేశారు. అదేంటంటే.. అతడు ఒక పెట్ ను తన ఇంటికి తెచ్చుకున్నట్లు పేర్కొన్నాడు.
అతడు పెట్ ను ఎత్తుకొని దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది నెటిజన్లను తెగా ఆకర్షిస్తున్నాయి. ఆ పెట్ పేరే.. రైమ్ అని తెలిపాడు. దీనికి క్యాప్షన్ గా మా ఇంటికి కొత్త అతిథి వచ్చినట్లుగా చెప్పాడు. ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ 14 వ సినిమా ఆర్ఆర్ఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. అతడి 15వ సినిమా లెంజడరీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది.































