ఉపాసన పేరు అందరికీ తెలిసే ఉంటుంది. మెగస్టార్ తనయుడు రామ్ చరణ్, ఉపాసన 2012లో వివాహం చేసుకున్న విషయం విధితమే. ఆమెకు పెళ్లి కాకముందే ఎన్నో బిజినెస్ లను చూసుకునేదట. ప్రస్తుతం ఆమె అపోలో సంస్థల అధినేతగా, ఫిట్నెస్ ఎక్స్పర్ట్ గా, సోషల్ వర్కర్ గా ఆమె పలు రంగాలలో రాణిస్తున్నారు.

ఆమె ఓ మ్యాగజైన్ ను కూడా నడుపుతున్నారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి. ఉన్నత కుటుంబంలో పుడితే సమస్యలు ఉండవు అనేది కరెక్ట్ కాదని చెప్పింది. కొంతమంది చెప్పుకుంటారు.. మరికొంత మంది చెప్పుకోలేరు అంటూ చెప్పింది. ఇక ఆమె వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ ఇలా చెప్పింది..
తాను మొదట్లో లావుగా ఉన్నానని.. ఎంతో మంది నన్ను మనస్సును గాయపరిచే విధంగా మాట్లాడరని.. ప్రస్తుతం లావు తగ్గి.. ఇలా ఉన్నానని చెప్పింది. అయితే ఇప్పుడు నన్ను చూసి ఎంతో అందంగా ఉన్నవ్ అంటూ పొగుడుతున్నారని.. కానీ ఆ పొగడ్తను తాను తీసుకోలేకపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది. తాను లావు తగ్గడానికి ఎంతో కష్టపడ్డానని.. జిమ్ లు, ఆహార నియమాలు పాటించానని చెప్పారు.
కెరీర్ లో అయినా.. బలంలో అయినా ఆడవాళ్లకు, మగవాళ్లకు మధ్య తేడా లేదని.. ఎవరి బాలాలు వాళ్లకు ఉంటాయని చెప్పుకొచ్చింది. అంతెందుకు తన బెస్ట్ ఫ్రెండ్ ఓ ట్రాన్స్ జెండర్ అని.. తను ఏ విషయంలో కూడా డల్ గా ఉండరని.. ప్రతీ విషయంలో ఎంతో చురుకుగా ఉంటారని చెప్పారు ఉపాసన. ఇక పిల్లల గరించి అడినప్పుడు అది తన వ్యక్తిగతం అని చెప్పుకొచ్చారు.































