Ramgopal Varma: రాంగోపాల్ వర్మ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఈయన తరచూ ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన ఏ విషయం అయినా తనకు తోచినట్టుగా మాట్లాడుతూ పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.ఇలా అవతల వారి ఎమోషన్స్ ఫీలింగ్స్ తో తనకు ఏ మాత్రం సంబంధం లేదు అనేలా వర్మ ప్రవర్తిస్తూ ఉంటారు.

ఇక అమ్మాయిలతో కలిసి ఈయన చేసే డ్యాన్సులు వారి అందాలను పొగుడుతూ ఇచ్చే ఇంటర్వ్యూలు ఎలా పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇప్పటికే ఆరియానా, ఆశు రెడ్డి వంటి వారితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచిన వర్మ నటి ఇనయ సుల్తానాతో కలిసి ఆమె పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి డాన్స్ చేస్తూ చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి.
ఇలా అమ్మాయిలతో కలిసి పబ్బుల్లో తనదైన స్టైల్ లో డాన్సులు చేసే వర్మ తాజాగా మరోసారి మిడిల్ ఏజ్ అమ్మాయిలతో కలిసి ఏకంగా ‘ఉ..అంటావా..మావ.. ఉఊ ..అంటవా’ అనే పాటకు చిందులు వేశారు.ఈ విధంగా పబ్బులో వర్మ అమ్మాయిలతో కలిసి ఐటమ్ సాంగ్ కు చిందులు వేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఎంతోమంది నెటిజెన్లు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్ లు చేస్తున్నారు.

Ramgopal Varma: వర్మలా బ్రతకాలంటే ధైర్యం కావాలి..
జీవితమంటే వర్మది… ఈయన బతకాలంటే ఎంతో అదృష్టంతో పాటు ధైర్యం కూడా ఉండాలి.ఆర్జీవి ఎంతో మనస్ఫూర్తిగా బ్రతికే వ్యక్తి తన జీవితంలో అన్ని సాధించిన తర్వాత తన జీవితాన్ని తనకి ఇష్టం వచ్చిన విధంగా గడుపుతున్నారు అంటూ ఎంతోమంది ఈ వీడియో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి వర్మ ఏం చేసినా సెన్సేషనల్ అవడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఈ వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
































