రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ప్రస్తుతం కాంట్రవర్సీలతోనే కాపురం చేస్తున్నాడు. అతడు ఏం చేసినా సోషల్ మీడియాలో తెగ రచ్చ రచ్చ అవుతుంది. ఎప్పుడు ఏం చేస్తాడో, ఏలా స్పందిస్తాడో ఊహించడం కష్టం. తీసే సినిమాలు,చేసే చేష్టలు అన్నీ కూడా వివాదాలతో ముడిపడి ఉంటున్నాయి. సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని అందరికంటే భిన్నంగా చూసే వర్మ తన తీరుతో ఎదుటివారిని ఇబ్బంది పెడతాడు. ఇక ఈ మధ్యకాలం బుల్లితెర యాంకర్లతో వర్మ చేసిన రచ్చ మామూలుగా లేదు.

ముఖ్యంగా ఆయన తన కూతురు వయస్సు ఉన్న అమ్మాయిలతో చేసే రచ్చ చర్చనీయాంశంగా మారుతుంది. ఆ మధ్య బిగ్‌బాస్ భామ అరియానా గ్లోరీతో బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్జీవీ ఇటీవల మరో బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డిని డిఫరెంట్ యాంగిల్‌లో ఫొటో తీసి షాక్ ఇచ్చాడు. అప్సరా రాణి, మియా మాల్కోవా, శ్రీ రాపాక, నైనా గంగూలీ.. ఇలా ఆయన పలువురు అమ్మాయిలతో ఎంతగా రచ్చ చేశారో మనం చూశాం. సినిమా సెలబ్రేషనస్, బర్త్‌డే పార్టీలో ఆ మూవీ హీరోయిన్లతో డ్యాన్స్ చేసి హాట్‌టాపిక్‌గా మారుతున్నాడు ఆర్జీవీ.

తాజాగా ఇలానే మరోసారి వర్మ వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా ఫుల్‌గా వోడ్కా కొట్టిన వర్మ బర్త్‌డే జరుపుకుంటున్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. మళ్లీ అందుకు సంబంధించిన వీడియోని ధైర్యంగా ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్ బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఇందులో నటి జ్యోతి, శ్రీకాంత్ అయ్యంగార్‌లు కూడా ఉన్నారు. వారు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి కేక్ కట్ చేస్తుండగా వర్మ ఆ ఆమెతో కాస్త ఇబ్బందికరంగా వ్యవహరించాడు.
దీంతో ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు ఆర్జీవీపై మండిపడుతుండగా మరికొందరూ ‘మహానుభావుడు’ అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు వర్మలా బతకాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్ది వర్మ తుంటరి చేష్టలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వర్మ చేష్టలకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. అంతే కాకుండా కొంతమంది ఎంజాయ్ చేస్తే చేశాడు.. కానీ వీడియోలను అందరికీ చూపించడం ఎందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

































