Ramgopal Varma: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయినటువంటి రాంగోపాల్ వర్మ ప్రస్తుతం విభిన్న చిత్రాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన ఏదైనా చెప్పాలనుకున్న సినిమా ద్వారా తెలియజేస్తారు. ప్రస్తుతం బయోపిక్ చిత్రాలు,రాజకీయ నాయకుల జీవిత కథ ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అయితే ఒకప్పుడు వర్మ సినిమా అంటే అందులో ఏదో మ్యాజిక్ ఉండేది.

అప్పట్లో వర్మ సినిమాలకు ఎంతోమంది అభిమానులు ఉండడమే కాకుండా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేవి. ఇకపోతే వర్మ దర్శకత్వంలో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది.ఇప్పటికీ శివ సినిమా అంటే ప్రేక్షకులకు తెలియని అనుభూతి కలుగుతుంది. అలా నాగార్జున హీరోగా నటించిన శివ సినిమా ఆల్ టైం హిట్ మూవీగా నిలిచింది.
ఇకపోతే ప్రస్తుతం వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లడ్కీ (అమ్మాయి) అనే సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో మాత్రమే కాకుండా, చైనాలో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ శివ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు.

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ నుంచి కాపీ కొట్టినదే శివ…
బాక్సాఫీస్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన శివ సినిమాను తాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమా నుంచి శివ సినిమాను కాపీ కొట్టాను అంటూ అసలు విషయం బయట పెట్టారు. ఆ సినిమాలో హీరో రెస్టారెంట్ కోసం పోరాటం చేయగా శివ సినిమాలో హీరో కాలేజ్ కోసం పోరాటం చేస్తారు. కేవలం ఈ సన్నివేశం ఒక్కటే మార్చానని మిగిలినది మొత్తం అలాగే చేయటం వల్ల ఈ సినిమా స్క్రిప్ట్ 20 నిమిషాలలో పూర్తి చేశానని ఈ సందర్భంగా వర్మ శివ సినిమా సీక్రెట్ బయటపెట్టారు. ఈ క్రమంలోని శివ సినిమా గురించి వర్మ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































