Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆస్కార్ వేడుకలలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లారు. ఈయన అమెరికాలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అక్కడ పలు ఇంటర్వ్యూలకు టెలివిజన్ షోలకు హాజరవుతూ తన సినిమా కెరియర్ గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికాలో ఒక టెలివిజన్ నిర్వహిస్తున్నటువంటి గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అందరితో పంచుకున్నారు. ముఖ్యంగా మరి కొద్ది రోజులలో రామ్ చరణ్ తండ్రి కాబోతుండడంతో ఈయన ఈ సంతోషకరమైన విషయం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మీరు తండ్రి కాబోతున్నారనే విషయాన్ని మొదటగా ఎవరితో పంచుకున్నారు అనే ప్రశ్న కూడా ఎదురయింది.
తాను తండ్రి కాబోతున్నాననే విషయాన్ని ముందుగా నా తల్లిదండ్రులకు చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ప్రకటించే ముందు ఈ సంతోషకరమైన శుభవార్తను నా బెస్ట్ ఫ్రెండ్ జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకున్నానని తెలియజేశారు. నేను తనకి ఫోన్ చేసి తండ్రి కాబోతున్నాననే విషయాన్ని తెలియజేసినట్లు రామ్ చరణ్ తెలిపారు.

Ramcharan: జీవితంలో కొత్త కోణాన్ని చూడబోతున్నాం…
ఇలా తాను తండ్రి కాబోతున్నారని వార్త తనకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని,ఈ శుభవార్త తాను ఎప్పుడు చెబుతానా అని తన తల్లిదండ్రులు ఎంతో ఎదురుచూసారని ఈ వార్త చెప్పడంతో వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారని రామ్ చరణ్ తెలిపారు.ఈ విధంగా త్వరలోనే ఉపాసనా నేను తల్లిదండ్రులు కాబోతుండడంతో జీవితంలో సరికొత్త కోణాన్ని చూడబోతున్నాము అంటూ రాంచరణ్ తన సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం రాంచరణ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























