Ramcharan: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన మెగా వారసుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రాంచరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇక ఆ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఈ మేరకు పలు ప్రతిష్టాత్మక అవార్డ్ లతో పాటు.. దేశంలోని పలు ప్రతిష్టాత్మకమైన సదస్సులకు కూడా రామ్ చరణ్ కు ఆహ్వానాలు అందుతున్నాయి.

ఈ క్రమంలో తాజాగా కశ్మీర్లో జరుగుతున్న G20 సదస్సు 2023 లో చరణ్ పాల్గొన్నాడు. మే 22 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న జీ20 సదస్సులో 17 దేశాల నుంచి ఫిలిం టూరిజం ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక పరిరక్షణ పై చర్చలు జరపనున్నారు. ఈ సదస్సుకు మన దేశం నుంచి, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
ఇక ఈ సదస్సులో సెంట్రల్ మినిస్టర్స్ కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అందరు ఆశ్చర్యపడేలా రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..” చరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక్కడికి ప్రజలు వచ్చింది కూడా మమల్నిచూడడానికి కాదు. రామ్ చరణ్ చూడడానికే వచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు.

Ramcharan: చేతులు జోడించి నమస్కరించిన చరణ్…
ఆయన అలా మాట్లాడటంతో రామ్ చరణ్ ముసిముసి నవ్వులు నవ్వుతూ.. చేతులెత్తి నమస్కారం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. G20 సదస్సు కోసం కాశ్మీర్ వెళ్ళిన రామ్ చరణ్ ఈ మూడు రోజులు పాటు శ్రీనగర్ లోనే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో రామ్ చరణ్ కూడా భాగం కావడంతో చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ..సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
“#RamCharan is Here, I don’t think i have to make any Introduction because people come to see us because we are Sitting Besides Him”.
– Jitendra Singh Minister of State (Independent Charge) for Science & Technology.#RamCharanForG20Summit@AlwaysRamCharan ???????? pic.twitter.com/dwHoqNkbgN
— Ujjwal Reddy (@HumanTsunaME) May 22, 2023



































