Ramcharan: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు సముద్రఖని ఒకరు. అయితే తాజాగా ఈయన గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బ్రో సినిమాకు దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ తనకు రామ్ చరణ్ తో ఎంతో మంచి అనుబంధము ఉందని తెలిపారు. తాను రాంచరణ్ తో కలిసి త్రిబుల్ ఆర్ సినిమాలో నటించాను. ఇందులో నన్ను బాబాయి బాబాయి అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచారు ఈ సినిమా సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరిందని, రామ్ చరణ్ నాకు సొంత కొడుకుతో సమానమని సముద్రఖని తెలిపారు.
రామ్ చరణ్ కు ఎలాంటి కష్టం రాకూడదని ప్రార్థించే వారిలో తాను కూడా ఒకరని ఈయన తెలిపారు. ఇకపోతే మరోసారి రామ్ చరణ్ తో కలిసి తాను గేమ్ చేంజర్ సినిమాలో నటించబోతున్నానని ఇందులో కూడా మా ఇద్దరి మధ్య కొనసాగే సన్నివేశాలు అద్భుతంగా ఉండబోతున్నాయని తెలిపారు.ఇలా రామ్ చరణ్ గురించి మాత్రమే కాకుండా అల్లు అర్జున్ గురించి కూడా సముద్రఖని పలు విషయాలను తెలియజేశారు.

Ramcharan: అందరితో ప్రేమగా ఉంటారు…
తాను అల్లు అర్జున్ తో కలిసి అలా వైకుంఠపురం సినిమాలో నటించానని తెలిపారు. అయితే తాను అల్లు అర్జున్ ను అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం ఈయన షూటింగ్ లొకేషన్లో అందరితోనూ చాలా ప్రేమగాnఉంటారని అందుకే తనని అలా పిలుస్తానని తెలిపారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆయన తన పట్ల ఎంతో జాగ్రత్తలు తీసుకున్నారు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Samuthirakani Garu About Our @AlwaysRamCharan 😍#GameChanger Lo Rc Ki Babai Ante 💥 pic.twitter.com/4o8W7AAnpi
— CharanPravi ❤️ (@IMPravallikaM17) August 3, 2023