Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్య ఉపాసనతో కలిసి వివిధ దేశాలలో పర్యటిస్తూ ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తన భార్య ప్రెగ్నెంట్ కావడంతో ప్రస్తుతం చరణ్ తన భార్య వెంటే ఉంటూ తన కోరికలన్నీ తీరుస్తూ దేశ విదేశాలలో పర్యటిస్తున్నారు.

ఇకపోతే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మంచు మనోజ్ దంపతులకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ ఉపాసన రాంచరణ్ పంపిన కానుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మంచు మనోజ్ భూమా మౌనిక గత కొంతకాలంగా రిలేషన్ లో ఉంటూ మార్చి మూడవ తేదీ పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ జంట పెళ్లి బంధంతో అతి కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు పెళ్ళిలో వచ్చిన కానుకలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక వీరి పెళ్లికి ఉపాసన రాంచరణ్ దంపతులు హాజరు కాకపోయినప్పటికీ పెళ్లి కోసం స్పెషల్ గిఫ్ట్ పంపించినట్లు తెలుస్తోంది.ఇక చరణ్ ఉపాసన పంపించిన గిఫ్ట్ కు సంబంధించిన ఫోటోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Ramcharan: కలవాలని ఎదురు చూస్తున్నాను…
ఇక ఈ ఫోటోని షేర్ చేసిన మనోజ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇలా ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి.థాంక్యూ చరణ్ ఉపాసన మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఎదురు చూస్తున్నాను. మాల్దీవ్స్ నుంచి రాగానే కలుద్దాం ప్రేమతో ఎం అండ్ ఎం అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గిఫ్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
Surprise gifts like these are ❤️
Thank you to the sweet couple @AlwaysRamCharan & @upasanakonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama ❤️
Can’t wait to meet you guys after your trip from Maldives,,have an amazing time????
Much love from M & M. ???? pic.twitter.com/Ex3EpRFDGJ— Manoj Manchu????????❤️ (@HeroManoj1) April 9, 2023































