Ramcharan: మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇంతకాలం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ని అసలు హీరో మెటీరియల్ కాదని ట్రోల్ చేశారు.

అయితే అప్పుడు అలా అన్నవారే ఇప్పుడు హీరో అంటే రామ్ చరణ్ లా ఉండాలి అనే స్థాయికి ఎదిగాడు.
చిరంజీవి వారసుడిగా చరణ్ ఇండస్ట్రీలో హీరోగా చాలా సులభంగా అడుగుపెట్టాడు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలదొక్కుకోవడానికి చరణ్ ఎంతో కష్టపడ్డాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా తొందర్లోనే రామ్ చరణ్ కి తండ్రిగా ప్రమోషన్ రాబోతోంది.
రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భంతో ఉంది. మెగా వారసుడు కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో కెరీర్ ప్రారంభంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టాడు. ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ ని ఇప్పటివరకూ మీ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఒకటి చెప్పండి అని యాంకర్ ప్రశ్నించగా… రామ్ చరణ్ కొంత సమయం ఆలోచించారు.

Ramcharan: సస్పెండ్ చేశారు…
చిన్నతనంలో స్కూల్ నుండి తనని సస్పెండ్ చేశారని, అయితే ఆ విషయం ఇంట్లో వాళ్లకు తెలిస్తే కోప్పడతారన్న భయంతో ఇప్పటివరకు ఆ విషయం గురించి ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా ఉంచానని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఇటీవల ఆర్ఆర్ఆర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు.



























