Ramcharan: ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే ఆస్కార్ నామినేషన్ లో భాగంగా నాటు నాటు పాట నామినేషన్ లో ఉండడంతో ఈయన అమెరికాలో పెద్ద ఎత్తున పలు ఇంటర్వ్యూలకు టాక్ షోలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. అదేవిధంగా రామ్ చరణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల వేడుకల్లో కూడా తళుకుమన్న విషయం మనకు తెలిసింది.

ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ అవార్డు ప్రజెంటేటర్ గా నిలవడం విశేషం. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా చిన్న ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకోవడంతో ఈ విశ్వవేదికపై నటి రామ్ చరణ్ ను క్షమాపణలు కోరడం ఆసక్తికరంగా మారింది. అసలు రామ్ చరణ్ కు నటి క్షమాపణలు చెప్పడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి నటి టిగ్ నోటారో వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ అవార్డును హాలీవుడ్ నటి అంజలి బీమానితో కలిసి రామ్ చరణ్ ప్రధానం చేశారు. ఈ క్రమంలోనే టిగ్ నోటారో రామ్ చరణ్ ని వేదిక పైకి ఆహ్వానిస్తున్న క్రమంలో ఆయన పేరు మరచిపోయారు. ఈ అవార్డును అందించాల్సిందిగా ఆమె రామ్ చరణ్ వేదిక పైకి పిలుస్తూ RRR సినిమాతో విజయాన్ని అందుకున్న ఇంటర్నేషనల్ స్టార్ రామ్ అంటూ వేదిక పైకి ఆహ్వానించారు. అయితే అక్కడ ఆయన పేరు మర్చిపోయి తడబడటంతో వెంటనే వెనుక ఉన్నవారు చరణ్ అంటూ తనకు సాయం అందించారు.

Ramcharan: రామ్ చరణ్ పేరు మర్చిపోయిన నటి…
ఇలా వేదిక పైకి వచ్చిన రామ్ చరణ్ ఈ అవార్డును అందించిన తర్వాత నటి టిగ్ నోటారో రామ్ చరణ్ పేరు మర్చిపోయినందుకు తనకు వేదికపైనే క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భాగంగా RRR సినిమాకు ఏకంగా ఐదు కేటగిరీలలో అవార్డులు రావడం విశేషం.
‘ MAN OF MASSES RAM CHARAN ‘
❤️???????? For a Reason ????He’s True GLOBAL Phenomenon ????
The International Film Superstar @AlwaysRamCharan‘s Aura at #HCAFilmAwards ❤️????#GlobalStarRamCharan @HCAcritics#GlobalstarRamcharan pic.twitter.com/v8PxuhZ4Pg— RC YuvaShakthi (@RcYuvaShakthi) February 25, 2023































