Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈనెల 12వ తేదీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు.

ఈనెల 12వ తేదీ చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం గన్నవరం ఎయిర్ పోర్ట్ సమీపంలో ఉన్న కేసరపల్లి ఐటీ పార్కులో సుమారు 11 ఎకరాలు స్థలంలో పెద్ద వేదికను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయని తెలుస్తుంది. 164 సీట్లతో ఘనవిజయం అందుకున్న కూటమి సభ్యులతోపాటు ఎంతో మంది రాజకీయ సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.
ఇక చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు కూడా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటుడు రామ్ చరణ్ కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ పనులలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం..
ఈయనకు ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందడంతో ఈయన కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారని సమాచారం. ఇక జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఇక జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం.





























