Ramoji Rao: రామోజీరావు పరిచయం అవసరం దేని పేరు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతలు పొందిన ఈయన మన దేశంలోనే అత్యంత కుబేరులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకున్నారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీరావు మొట్టమొదటి పత్రిక రంగాన్ని స్థాపించి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.

ఇలా ఈనాడు పత్రిక రంగంలో విజయం అందుకున్న ఈయన అనంతరం ఈటీవీ చానల్స్ తో పాటు రామోజీ ఫిలిం సిటీని కూడా ప్రారంభించారు అప్పటి ప్రభుత్వ అధికారులకు సన్నిహితులైనటువంటి ఈయన కొన్ని వేల ఎకరాలు రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చే విధంగా మార్చుకున్నారు. దీంతో వేల ఎకరాలలో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు.
ఇలా రామోజీ ఫిలిం సిటీలో మన దేశంలోనే కాకుండా హాలీవుడ్ సినిమాలు సైతం షూటింగ్ జరుపుకునేలా దీనిని తీర్చేదిద్దారు. దీనితోపాటు ఈటీవీ చానల్స్ ప్రియా పచ్చళ్ళు మార్గదర్శి చిట్ ఫండ్ వంటి ఎన్నో వ్యాపార సంస్థలను ప్రారంభించి భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించారు. ఇక ఈయన ఆస్తుల వివరాలు లెక్కలేయాలి అంటే కూడా కష్టతరం అనే చెప్పాలి.
పలు నివేదికల ప్రకారం రామోజీరావు నికర ఆస్తులు విలువ సుమారు 46 వేల కోట్ల వరకు ఉంటుందని సమాచారం. మరి ఈ స్థాయిలో ఆస్తులను సంపాదించిన రామోజీరావు మరణం తర్వాత ఆయన ఆస్తులు ఎవరికి దక్కుతాయనే విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. రామోజీరావుకి కిరణ్, సుమన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే సుమన్ 2012 సంవత్సరంలోనే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.
తన వారసులు..
ఇక ఈయన మరణించే సమయానికి రామోజీరావు కొంత ఆస్తులను తన ఇద్దరు కుమారుల పేరా రాశారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సుమన్ పిల్లలు కూడా ఈ ఆస్తికి వారసులని తెలుస్తుంది. ఇలా రామోజీరావు తర్వాత తన ఆస్తిని తన ఇద్దరు పిల్లలకు చెందుతుందని చెప్పాలి.



























