Amaravathi: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరావతి నిర్మాణ పనులు కూడా వేగవంతం అవుతాయని ఈయన బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలియజేశారు. ప్రస్తుతం అమరావతిలో నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది.ఇకపోతే విజయవాడలో రామోజీరావు సంస్కరణ సభను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది.

అనారోగ్య సమస్యలతో ఇటీవల రామోజీరావు మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు విజయవాడలో భారీ స్థాయిలో రామోజీరావు సంస్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులు మంత్రులు రామోజీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీరావు కుమారుడు కిరణ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తన తండ్రి ప్రజా శ్రేయస్సు కోసమే కష్టపడేవారని దేశవ్యాప్తంగా ఎక్కడ విపత్తు వచ్చిన ఆదుకోవడానికి ముందు ఉండేవారని తెలిపారు.ఆయన ఎప్పుడూ ప్రచారాన్ని ఇష్టపడేవారు కాదని.. మనం చేసే పనులు ప్రజలకు ఉపయోగపడేవా? కాదా? అని మాత్రమే చూడమనేవారని గుర్తు చేశారు.తన తండ్రి స్ఫూర్తితో తాము ఎల్లప్పుడూ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని మాటిస్తున్నట్లు చెప్పారు.
గొప్ప నగరంగా అమరావతి..
ఈ క్రమంలోనే అమరావతి రాజధానిగా దేశంలోనే గొప్ప నగరంగా నిలవాలన్నదే నాన్న కోరిక అందుకే అమరావతి నిర్మాణానికి తమ వంతు 10 కోట్ల రూపాయల విరాళం అందిస్తున్నట్లు ఈనాడు సంస్థల ఎండి కిరణ్ కుమార్ తెలిపారు. ఇక ఈయన ఇందుకు సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు అందజేశారు.





























