Ramoji Rao: రామోజీ గ్రూప్స్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. ఈయన గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. అయితే శనివారం ఉదయం తెల్లవారుజామున ఈయన మరణించారు. ఇక ఈయన మరణ వార్త తెలిసి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు మీడియా రంగం వారు తనకు నివాళులు అర్పించారు.

ఇక నిన్నటి నుంచి సందర్శనార్థం రామోజీ ఫిలిం సిటీలో తన నివాసం వద్ద ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఇక నేడు 10 గంటల సమయంలో రామోజీరావు అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. అయితే ఈయన రామోజీ ఫిలిం సిటీలో ముందుగా నిర్మించుకున్నటువంటి స్మారక చిహ్నంలోనే ఆయన అంత్యక్రియలు ముగిసాయి.
ఎంతోమంది ఆశ్రమ నయనాల నడుమ రామోజీరావు అంతిమయాత్ర జరిగింది. ఇక ఈ అంతిమయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు తన పాడే మోసారు. ఇలా బాధతత్త హృదయంతో రామోజీరావుకి తన కుటుంబీకులు స్నేహితులు వీడ్కోలు పలికారు. పత్రికా రంగంలో ఎంతో ఒరవడిని సాధించిన రామోజీరావు ఇక తన ప్రస్తానానికి సెలవు చెబుతూ దివికే గారు.
ఇక సెలవు..
ప్రస్తుతం ఈయన అంతిమయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రతికుండగానే తన అంత్యక్రియలు ఎక్కడ జరగాలనే విషయాలన్నింటిని కూడా తెలియజేయడమే కాకుండా తనకు నచ్చినట్టు తన సమాధిని నిర్మించుకొని మరణించడం అందరిని మరింత కంటతడిని పెట్టిస్తోంది.


























