రమ్య హత్య కేసు నిందుతుడు శశి క్రిష్ణ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. బిటెక్ చదువుతున్న రమ్యను ప్రేమకోసం వేధించేవాడని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతుంటే పక్కన ఉన్నవాళ్లు చూస్తూ ఉండి పోయారని అన్నారు.

కాగా రమ్యకు నిందుతుడు సోషల్ మీడియాలో పరిచయమయ్యా డని పోలీసులు తెలిపారు. ప్రేమను నిరాకరించడంతోనే అతను రమ్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళలు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. పిల్లల కదలికల పట్ల తల్లి దండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.






























