Ramya Raghupathi: రమ్య రఘుపతి పరిచయం అవసరం లేని పేరు నరేష్ మూడవ భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే.ఎప్పుడైతే నరేష్ నటి పవిత్ర లోకేష్ ను పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయో ఆ క్షణమే ఈమె మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున నరేష్ పవిత్రల వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

ఇక కొత్త సంవత్సరం రాబోతున్న నేపథ్యంలో నరేష్ పవిత్ర ఇద్దరు కూడా లిప్ లాక్ చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో రమ్మే రఘుపతి మరోసారి నరేష్ వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రమ్య రఘుపతి మాట్లాడుతూ తనునరేష్ కు విడాకులు ఇచ్చేవరకు ఆయన పవిత్రను పెళ్లి చేసుకోలేరు. అయితే తనకు విడాకులు ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదని కామెంట్ చేశారు.
ఇక నరేష్ తనకు విడాకులు ఇవ్వమని తనకు పెద్ద మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని రమ్య తెలియజేశారు.నరేష్ మూడు కోట్ల నుంచి దాదాపు 20 కోట్ల వరకు డబ్బును ఆఫర్ చేసినట్లు ఈ సందర్భంగా రమ్య వెల్లడించారు. అయితే తనకు డబ్బు ముఖ్యం కాదని తనకు విడాకులు ఇవ్వనని రమ్య తెగేసి చెప్పారు. రమ్య విడాకులు ఇస్తేనే నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోవచ్చని లేకపోతే వారి పెళ్లి జరగదనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రమ్య విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రల పెళ్లి జరగకుండా చేస్తాను అంటూ శపదాలు కూడా చేసింది.

Ramya Raghupathi: 20 కోట్ల రూపాయల డబ్బు ఆఫర్ చేశారు…
ఇక నరేష్ రమ్య విడాకులు తీసుకోకపోయినా దూరంగా ఉండడంతో నరేష్ పవిత్రకు దగ్గరయి ఆమెతో సహజీవనం చేస్తున్నారు. ఇక వీరిద్దరి విడాకులు అధికారకంగా మంజూరు అయితే త్వరలోనే నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నారని ఇదే విషయాన్ని వీడియో ద్వారా నరేష్ తెలియజేశారు. అయితే వీరి వివాదం రోజురోజుకు ముదరడంతో కొందరు ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని అనవసరంగా కుటుంబ పరువు పోతుంది అంటూ సలహాలు కూడా ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.































