Rangam Bhavishyavaani : గత ఏడాది హామీలు ఏమయ్యాయి… ఈ ఏడాది వర్షాలు, అగ్నిప్రమాదాలు…!

0
137

Rangam Bhavishyavaani : ప్రతి ఏడాది ఆషాడంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి. తెలంగాణలో బోనాలను కన్నులపండుగగా జరుపుతారు. ప్రతిసారిలాగేనా ఈ ఏడాది ఘనంగా లష్కర్ బోనాల పండుగ మొదలయింది, రెండో రోజు రంగం కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా మహంకాళి అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది పంటల పరిస్థితి, వర్షాలు, రాజకీయాలు ఇలా అన్నింటి గురించి అమ్మవారు తెలిపారు.

వర్షాలు బాగుంటాయి…

రంగం భవిష్యవాణిని పచ్చికుండ పై నిలబడి స్వర్ణలత అమ్మవారు పూనాక భవిష్యత్తు చెప్పారు. గత ఏడాది ఇచ్చిన హామీలను మరచిపోయారంటూ అమ్మవారు పలికారు. ఈ ఏడాదైనా ఆ హామీలను తీర్చాలని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా ఈ ఏడాది వర్షాలు పడుతాయని చెప్పారు.

అయితే అగ్నిప్రమాదలు జరుగుతాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇక తను చూస్తూనే ఉన్నట్లు ప్రతి గడపను కాపాడుతానని అమ్మవారు అభయం ఇచ్చారు. పూజలు అన్నీ చక్కగా నిష్ఠతో చేసారని, తాను ఎవరు ఏమి చేసారో అన్నీ చూస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది లోపు గతంలో ఇచ్చిన హామీలను తీర్చాలని చెప్పారు. ఇక బోనాల ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించగా లక్షలాది మంది ఈ ఏడాది బోనాలకు వచ్చారు.