Bharath Biotech: భారత్ బయోటెక్.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ టీకాపై ప్రచురించిన 14 కథనాలను తొలగించాలని ‘ది వైర్’ వెబ్ సైట్ పై దాఖలైన పిటిషన్ ను రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా కోర్ట్ జడ్జి విచారణ చేపట్టారు. నోటిసులు అందిన 48 గంటల్లో తొలగిచాలని ఆదేశించిది కోర్ట్. ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేసిది

ఈ నేపథ్యంలో భవిష్యత్తులోనూ.. భారత్ బయోటెక్ కంపెనీ, డైరెక్టర్లు, ఉద్యోగులు, ఏజెంట్లు, ఉత్పత్తుల పరువుకు భంగం కలిగించేలా కథనాలు ప్రచురించరాదని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తమ కంపెనీతోపాటు తాము ఉత్పత్తి చేసిన కొవాగ్జిన్ పై ఎలాంటి ఆధారాలు లేకుండా రాసిన కథనాలను తొలగించానలి ఆదేశిచింది కోర్ట్

దురుద్దేశ పూర్వకంగానే ది వైర్ వెబ్ సైట్ తన కంపెనీ ఉత్పత్తులపై కథనాలు రాసిందని పిటిషనర్ తరుపును న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన కోర్ట్..
15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తికి భారత్ బయోటెక్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ది వైర్ వెబ్ సైట్ రాసిన కథనాల కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకాలు వేయించడానికి వెనుకంజ వేసే ప్రమాదం ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారన. ఈ వాదనలు విన్న కోర్ట్ ఆయా కథనాలను తొలగించాలని, భవిష్యత్తులో రాయకూడదని.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు అందచేయాలని పిటిషనర్ ను ఆదేశిస్తూ.. తరుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది.






























