హైదరాబాద్: “గాడ్ ఆఫ్ మాసెస్” నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హీరోగా ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తిస్తూ, యూకేకు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) ఆయన పేరును తమ గోల్డ్ ఎడిషన్‌లో చేర్చింది. ఈ అసాధారణ గుర్తింపును బాలయ్య ఆగస్టు 30న హైదరాబాద్ లో జరగబోయే ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు.

తండ్రి వారసత్వంతో స్వతంత్ర గుర్తింపు
బాలకృష్ణ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి, నటసార్వభౌమ నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తూనే, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. అనేక సవాళ్లను ఎదుర్కొని, విభిన్నమైన పాత్రల్లో కొత్తదనం చూపిస్తూ, తరతరాల ప్రేక్షకులను అలరించారు. మాస్\u200c హీరోగా ఆయనకున్న ఇమేజ్, ఆయన సంభాషణలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ 50 ఏళ్ల ప్రయాణంలో బాలకృష్ణ ఎన్నో రికార్డులను, పురస్కారాలను అందుకున్నారు.
వెండితెరపైనే కాదు, రాజకీయాల్లోనూ..
బాలకృష్ణ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా, రాజకీయ నాయకుడిగా, సేవామూర్తిగా కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేశారు. సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తన తండ్రి పేరుతో స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా, వేలాది మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ అశేష ప్రజల ఆదరాభిమానాలను పొందారు.
నిజమైన లెజెండ్ ని గౌరవిస్తున్నాం: WBR
బాలకృష్ణకు ఈ గౌరవం కల్పిస్తూ WBR సీఈఓ సంతోష్ శుక్లా ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. “బాలకృష్ణ ఐదు దశాబ్దాల ప్రయాణం లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తుందని, ఆయన కృషి అసాధారణమని” ఆయన ప్రశంసించారు. “మేము కేవలం విజయాలను మాత్రమే కాకుండా, నిజమైన లెజెండ్‌ని నిర్వచించే మానవీయ విలువలను కూడా గుర్తిస్తున్నాం” అని శుక్లా పేర్కొన్నారు. బాలకృష్ణకు లభించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గర్వకారణం అని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
A phenomenonal achievement by the God of Masses #NBK ❤️🔥
— BA Raju's Team (@baraju_SuperHit) August 24, 2025
Natasimham Shri. #NandamuriBalakrishna has been honoured with the Gold Edition Recognition by the World Book of Records, UK, for completing 50 glorious years as a hero in Indian cinema ✨
First Actor in Indian Cinema to be… pic.twitter.com/qXuzfMipUv



























