Rashmi: బుల్లితెర యాంకర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రష్మీ వెండితెరపై కూడా సినిమాలలో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.

పలు సినిమాలలో నటించినటువంటి ఈమెకు పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు పైగా ఈమె నటించిన సినిమాలు కూడా సక్సెస్ కాకపోవడంతో వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెరపై తన కెరియర్ కొనసాగిస్తున్నారు. ఇలా బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి రష్మీ బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించారు.
ఇలా ఈమె రెండు సీరియల్స్ లో మాటీవీలో ప్రసారమయ్యే సీరియల్స్ లో చేశారని తెలుస్తుంది ఈమె లవ్ అనే సీరియల్ తో పాటు యువ అనే సీరియల్ లో కూడా నటించారు. ఇలా బుల్లితెరపై ఈమె నటించిన ఈ సీరియల్స్ మంచి ఆదరణ రావడంతో తనుకు సినిమా అవకాశాలు వచ్చాయి అయితే సినిమాలలో సక్సెస్ కాకపోవడంతో తిరిగి బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
వెండితెర సక్సెస్ ఇవ్వలేదా..
ఇలా వెండితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేని రష్మీ బుల్లితెరపై మంచి సక్సెస్ కావడంతో ఈమె బుల్లితెరకు మాత్రమే పరిమితం అయ్యారని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో మనకు సినిమాలలో అవకాశాలు వచ్చినప్పటికీ హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలక పాత్రలలో నటిస్తున్నారు.



























