Rashmi: గ్యాప్ వచ్చేస్తుందంటూ బాయ్ ఫ్రెండ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి… ఏం జరిగిందంటే?

0
33

Rashmi: ప్రస్తుత కాలంలో ఒక భాషలో ఎంతో అద్భుతమైన సక్సెస్ సాధించిన సినిమాలు మరొక భాషలో విడుదలవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటికే కాంతారా,కేజిఎఫ్, చార్లీ 777 వంటి సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి సక్సెస్ సాధించినటువంటి సినిమాని తెలుగులో బాయ్స్ హాస్టల్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. కన్నడ సినిమాలో అక్కడ రక్షిత్ శెట్టి, దివ్య స్పందన వంటి వాళ్లు అతిథి పాత్రలలో మెరిశారు. తెలుగులో ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ ను అలాగే యాంకర్, నటి రష్మీ గౌతమ్ అతిథి పాత్రలో నటించారు.

ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రష్మీ కూడా పాల్గొన్నారు. అయితే రశ్మిని ఈ కార్యక్రమంలో ప్రశ్నిస్తూ మీకు ఎవరైనా హాస్టల్లో ఉండే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రశ్మి సమాధానం చెబుతూ ఇప్పుడు బాయ్స్ హాస్టల్ లో ఉన్న బాయ్ ఫ్రెండ్ లతో రిలేషన్ లో ఉన్నానంటే చాలా గ్యాప్ వచ్చేసినట్టు భావించాలి. నాకు అలాంటి బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు అంటూ ఈమె సమాధానం చెప్పారు.

Rashmi: జనాలకు గుర్తుండాలంటే అలా చేయాల్సిందే..


బాయ్ ఫ్రెండ్స్ గురించి రష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాలలో హీరోయిన్ గా కాకుండా అతిథి పాత్రలలో నటించడం గురించి కూడా రష్మి స్పందించారు. ఇలా వచ్చిన పాత్రలన్నింటిని సద్వినియోగం చేసుకుంటు నటిస్తూ పోతూనే మనం జనాలకు గుర్తు ఉంటామని లేకపోతే మర్చిపోతారు అంటూ రష్మి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రష్మి ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు.