Rashmika:రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి కిరిక్ పార్టీ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక ఏప్రిల్ 5వ తేదీ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే అభిమానులు పెద్ద ఎత్తున రష్మికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విషయాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రష్మిక నటనలో ఎంతో టాలెంట్ కలిగిన హీరోయిన్ అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈమె యాక్టింగ్ లో మాత్రమే కాదు చదువులో కూడా ఎంతో టాలెంట్ కలిగి ఉన్నారని తెలుస్తోంది.
సాధారణంగా సెలబ్రిటీలకు చదువుపై ఇష్టం లేదనీ చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు మాత్రం ఉన్నత చదువులు చదివి ఇండస్ట్రీలో స్థిరపడిన వారు ఉన్నారు. ఇక రష్మిక సైతం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బ్యాచిలర్ డిగ్రీలను అందుకున్నారట. 1994 కూర్గ్ ప్రాంతంలో జన్మించిన రష్మిక తన స్కూల్ మొత్తం అక్కడే పూర్తి చేశారని తెలుస్తోంది. అనంతరం ఈమె బెంగళూరులోని రామయ్య డిగ్రీ కళాశాలలో ఏకంగా మూడు డిగ్రీ పట్టాలు పొందారని తెలుస్తోంది.

Rashmika: మూడు డిగ్రీ పట్టాలు పొందిన రష్మిక…
ఈమె ఈ కాలేజీలో సైకాలజీలో డిగ్రీ పట్టా పొందారు. దీనితోపాటు జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో కూడా డిగ్రీ అందుకున్నారని తెలుస్తోంది.ఇలా ఏకంగా మూడు డిగ్రీలు అందుకున్నటువంటి రష్మిక ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా 2014 సంవత్సరంలో ఈమె క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ పోటీలలో పాల్గొని గెలుపొందారు. ఇలా ఈ పోటీలలో గెలవడంతో తనకు సినిమా అవకాశాలు వచ్చాయని తెలియజేశారు.



























